డిఫరెంట్ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. పలు జోనర్‌లో స్పెషల్ రోల్స్ పోషిస్తూ యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మేజర్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ కథతో రాబోతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో పోరాడి.. తన ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథే ‘మేజర్’. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈసినిమా ఇప్పుడు వరుస అప్ డేట్స్ తో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. జూన్ 3న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇంకా తక్కువ రోజులే ఉండటంతో వరుస ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. అందులోనూ పాన్ ఇండియా సినిమా అవ్వడంతో వీలైనంత ఎక్కువగా అన్ని ప్రాంతాలు కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా అదే రోజున కమల్ హాసన్ విక్రమ్ సినిమా అలానే పృథ్విరాజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న అడివి శేష్ ను దీనికి సంబంధించి ప్రశ్న అడుగగా.. ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే మేజర్ సినిమా తెలుగులో పెద్ద సినిమా, విక్రమ్ తమిళ్ లో పెద్ద సినిమా అలానే పృథ్విరాజ్ హిందీ లో పెద్ద సినిమా.. అయితే ఒక సముద్రంలో ఎన్ని పెద్ద చేపలు ఉన్నా మాది మాత్రం గోల్డ్ ఫిష్ అని స్మార్ట్ ఆన్సర్ ఇచ్చాడు.
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: