హీరో కార్తీ “విరుమన్” మూవీ రిలీజ్ డేట్

Hero Karthi’s Viruman Movie Release Date Is Here,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Viruman,Viruman Movie,Viruman Tamil Movie,Viruman Movie latest Updates,Viruman Karthi Latest Movie Updates,Viruman Tamil Movie latest Updates, Hero karthi Viruman Movie Release Date Fixed,Hero Karthi Upcoming Movie Viruman Release Date Fixed,Karthi Viruman Movie Release Date Confirmed, Hero karthi Viruman Movie Releasing on August 31st

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ హీరో కార్తీ కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తాజాగా హీరో కార్తీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా “విరుమన్” తమిళ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో హీరో కార్తీ గ్రామీణ యువకుడిగా మాస్ పాత్రలో కనిపిస్తారు. ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, శరణ్య, ఇంద్రజ , మనోజ్ భారతీరాజా, సింగంపులి ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ తనయ అదితి శంకర్ “విరుమన్” మూవీతో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “విరుమన్” మూవీ రిలీజ్ డేట్ ని హీరో కార్తీ బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని ఆగస్టు 31న విడుదల చేస్తున్నామని హీరో కార్తి ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నారు. తిరునాళ్ల వాతావరణం మధ్య ఆరెంజ్ కలర్ షర్ట్ లుంగీ కళ్లకు గాగుల్స్ ధరించి కూల్ గా కనిపిస్తూ పోతరాజు కత్తి పట్టుకుని ఉన్న కార్తీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =