సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు , క్యాథరిన్ థ్రెసా జంటగా తెరకెక్కిన “భళా తందనాన “మూవీ మే 6 వ తేదీన విడుదలకానుంది.ఈ మూవీ లో రామచంద్ర రాజు , పోసాని , సత్య , అయ్యప్ప శర్మ , శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “భళా తందనాన “మూవీ ట్రైలర్ రిలీజ్ వైజాగ్ సిరిపురం లో గ్రాండ్ గా జరిగింది. ఈ ట్రైలర్ ను ప్రేక్షకులే ఆవిష్కరించడం విశేషం. దర్శకుడు చైతన్య దంతులూరి మాట్లాడుతూ.. వైజాగ్ అంటే ఇష్టమనీ , తన మొదటి సినిమా “బాణం” షూటింగ్ వైజాగ్ లో జరిగిందనీ , ఈ సినిమా మీకు తీపిగుర్తును ఇస్తుందనీ , శ్రీవిష్ణు బ్యూటిఫుల్ యాక్టర్ అనీ , మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తాడనీ , సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారనీ , శ్రీవిష్ణు నటన, మణిశర్మ సంగీతం పోటీపడినట్లుగా ఉంటుందనీ చెప్పారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమాకు కారణం సాయి కొర్రపాటిగారేననీ , ఆయన డేరింగ్ నిర్మాత అనీ , వారాహి సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉందనీ , క్వాలిటీపరంగా అన్నీ సమకూర్చి ప్రోత్సహించారనీ , దర్శకుడు చైతన్య , తాను 14 ఏళ్ళుగా స్నేహితులమనీ , మణిశర్మగారి సంగీతం చాలా బాగుందనీ , రీరికార్డింగ్ అద్భుతంగా ఇచ్చారనీ , మే6న ఈ సినిమాను థియేటర్‌లో చూడండనీ , మీరు పెట్టే టికెట్ కు రెండింతలు వినోదాన్ని “భళా తందనాన”మూవీ అందిస్తుందనీ , మీకు తప్పకుండా నచ్చుతుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: