‘ఎఫ్ 3’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

F3 Movie Trailer Release date locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 telugu Movie,f3 Movie Updates,F3 Movie Latest news,F3 Movie Trailer Release Date Fixed,F3 Movie Trailer Release Updates,Venkatesh and Varun Tej Movie F3 Trailer Release Updates, Venkatesh and Varun Tej Movie F3,Venkatesh and Varun Tej Multi Starrer Movie F3,Venkatesh and Varun Tej Multi Starrer F3 Movie Trailer Release Date Locked,F3 Movie Trailer Release date Fixed,F3 Movie Trailer Release date Confirmed, Venkatesh and Varun Tej F3 Movie Release Date Locked,Venkatesh and Varun Tej F3 Movie Trailer Release Date Announced,F3 Movie Official Trailer Release Date Announced

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఎఫ్3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2కు సిక్వెల్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి డ‌బుల్ ఎంట‌ర్టైన‌మెంట్‌తో ఎఫ్‌3 చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు అనిల్. అందుకే ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే బిజీలో ఉంది. ఈసినిమా రిలీజ్ కూడా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఈ ఏప్రిల్ 28న కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు అయితే ఇంకా పనులు పూర్తికాకపోవడంతో మే 27వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ కుడా రిలీజ్ చేసేశారు. ఇక పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గానే ఈసినిమా నుండి ఊ ఆ అహ అహ అనే రెండో పాటను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఈనేపథ్యంలోనే నేడు ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మే 9వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వెంకీ రే చీకటి, వరుణ్ నత్తి ఉండే పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా హెగ్టే ఓ స్పెష‌ల్ సాంగ్‌ లో కనిపించనుంది. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 18 =