మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ 15వ సినిమాగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మళ్లీ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా అమృత్ సర్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమా అమృత్ సర్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే చరణ్ తిరిగి హైద్రాబాద్ కూడా వచ్చేశారు. ప్రస్తుతం ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది కనుక కొద్ది రోజులు ఆచార్య ప్రమోషన్స్ లో పాల్గొననున్నట్టు సమాచారం. ఆతరువాత మళ్లీ శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: