‘సలార్’.. మోస్ట్ వయోలెంట్ గా ప్రభాస్..!

Rebel Star Prabhas Salaar Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Pan India Star Prabhas,Rebel Star Prabhas,Prabhas latest Movie Updates,Prabhas New Movie Updates,Prabhas Upcoming movies,Prabhas latest movie Salaar, Salaar Telugu movie,Prabhas Salaar movie Updates,Salaar upcoming Movie of Prabhas,Prabhas Salaar Interesting Updates,Interesting Updates From Salaar,Salaar movie Latest Update

రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు అభిమానులు సలార్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.ఇక ప్రశాంత్ నీల్ రీసెంట్ గా కె.జి.యఫ్ 2 తో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఇప్పుడు ‘సలార్’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గతేడాదే ఈసినిమా సెట్స్ పైకి వెళ్ళి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక మధ్యలో కరోనా వల్ల, ఆదిపురుష్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ మే ఫస్ట్ వీక్ నుండి తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా సింగరేణి బొగ్గుగనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లీక్ అయిన ఫొటోల్లో ప్రభాస్ కటౌట్ ను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈఫొటలో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. ఈసినిమాలో ప్రభాస్ మోస్ట్ వయోలెంట్, రూత్ లెస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడట. ఇక తాజాగాఈసినిమాలో ప్రభాస్ పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. చూద్దాం మరి సలార్ లో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడో.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్‌ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =