న్యాచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘అంటే సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈసినిమా. ఈ సినిమాను జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. ఇటీవలే నాని పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్ ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ టీజర్ ను ఏప్రిల్ 20 వ తేదీన ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: