‘హిట్’ హిందీ రీమేక్.. షూటింగ్ కంప్లీట్..!

Hit Movie Hindi Remake Regular shoot completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hit Movie,Hit Movie,Hindi Movie Remake,Hit Hindi Movie,Hit Movie Hindi Remake Shoot Completed,Hit Movie Hindi Remake Regular Shooting Completed,Hit Hindi Movie latest Updates, Hit Movie Hindi Rmake Latest Updates,Hit Movie Hindi Remake SHooting Updates,Hit Movie Hindi Remake upcoming Movie,Hero Rajkummar Rao in Hit Movie Hindi Remake

మన తెలుగు సినిమాలకు ఇప్పుడు హిందీలో ఎంత డిమాండ్ పెరిగిందో చూస్తున్నాం. ఇక్కడ హిట్ అయిన సినిమాలను దాదాపు నార్త్ లో కూడా రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు రీమేక్ అయ్యాయి. దీనిలో భాగంగానే తెలుగులో సూపర్ హిట్ అయిన హిట్ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శైలేష్ కొలను దర్శకత్వంలో “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు కదా. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు కూడా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకు కూడా మళ్లీ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించనున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నాడు. హీరోయిన్స్‌గా మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కనిపించనున్నారు.

హిందీ రీమేక్ ను కూడా తెలుగులో హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శైలేష్ కొలనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా ఇటీవలే మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తుండగా… సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను నిర్మాతలు దిల్ రాజు, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − five =