లవ్ లీ యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌కు దిల్ రాజు గారు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించారు. ఇక స్క్రిప్ట్ అందజేస్తూ కెమెరాను సాయి కుమార్ గారు స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ‘మా మూవీ ఓపెనింగ్‌కు వచ్చిన దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. చుట్టాలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ గారు ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవుతుంది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీ ఫెల్లో సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. ఈ రోజు అనూప్ గారి పుట్టిన రోజు. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని చెప్పారు. కాగా ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: