పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరోపక్క తన సినిమాలను కూడా పార్లల్ గా పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలను కమిట్ అయిన పవన్ గత ఏడాది వకీల్ సాబ్, ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాలను రిలీజ్ చేశారు. అయితే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం విశేషం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా పవన్ కు పర్ఫెక్ట్ రీఎంట్రీగా నిలువగా.. ఇటీవల వచ్చిన భీమ్లానాయక్ సినిమా మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అయిన హరి హర వీరమల్లు సినిమాపై ఫోకస్ ను పెట్టాడు. వరుసగా రెండు హిట్లు కొట్టడంతో ఇప్పుడు ఈసినిమాపై భారీ అంచనాలు పెరగడంతో పాటు హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటివరకూ కొంతమేరకూ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల బ్రేక్ పడిన షూట్ మళ్లీ ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు. ఈమేరకు డేట్ ను కన్ఫామ్ చేస్తూ తెలియచేశారు మేకర్స్. ఏప్రిల్ 8వ తేదీ నుండి ఈసినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెడుతున్నారు. ఇక ఈషెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించనున్నారు. దీనికోసం పవన్ కూడా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కసరత్తులు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Enigmatic and endearing @PawanKalyan garu rehearsing for a high voltage, full-throttle action sequence for #HariHaraVeeraMallu with Todor Lazarov @Juji79.
A film by @dirkrish@HHVMfilm Shoot resuming from 8th April 🎥 pic.twitter.com/yGyapjuSco
— Hari Hara Veera Mallu (@HHVMFilm) April 7, 2022
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: