అమృత్ సర్ లో “#RC15 ” మూవీ తాజా షెడ్యూల్

RC15 New Schedule In Amritsar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RC15,RC15 Movie Updates,RC15 Shoot Upates,RC15 Shooting Updates,RC15 Schedules,RC15 at Amritsar,RC15 Shooting at Amristsar,Ram Charan RC15 Mvie Updates, Ram Charan RC15 Latest Movie Updates,RC15 latest News,RC15 Telugu Movie Updates,RC15 To Shoot In Amristsar,Thaman S Music Composer For RC15,Racm Charan Movies, Ram Charan Upcoming movies, Ram Charan New Movie Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తాజా షెడ్యూల్ ను మేకర్స్ అమృత్ సర్ లో ప్లాన్ చేశారు. ఇప్పటికే హీరో రామ్ చరణ్ అమృత్ సర్ కు చేరుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ఆర్ఆర్”మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశవ్యాప్తంగా ప్రేక్షక , అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50 వ చిత్రంగా భారీ చిత్ర దర్శకుడు శంకర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.