విభిన్నమైన సినిమాలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే ‘బిచ్చగాడు’ సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో ‘కొలై’ సినిమా రూపొందుతుంది. ఇక తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ‘హత్య’ అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 6వ తేదీన సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా థ్రిల్లర్ నేపథ్యంలో జరుగుతున్న ఈసినిమాలో డిటెక్టివ్ వినాయక్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా రితిక సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. రాధిక, మురళీశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ బొహ్ర, ధనుంజయన్, ప్రదీప్ నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ కుమార్ దర్శకత్వం వహించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: