వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా డీసెంట్ హిట్ ను దక్కించుకుంది. రాాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఈసినిమాలోని ప్రభాస్-పూజాహెగ్డేల కెమిస్ట్రీ, విజువల్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ అయిన 22 రోజుల్లోనే రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. మరి ఈసినిమాను థియేటర్ లో చూడటం మిస్ అయినవాళ్లు.. అలానే ఈ విజువల్ ఫీస్ట్ ను మరోసారి చూసి ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు.
Hop on this magical journey of love with #RadheShyamOnPrime, April 1
#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @GopiKrishnaMvs @TSeries pic.twitter.com/D7ZcDFfS7y
— amazon prime video IN (@PrimeVideoIN) March 28, 2022
కాగా భాగ్యశ్రీ, కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్ తదితరులు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, ప్రసీద దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. జస్టిన్ ప్రభాకరన్ సౌత్ వర్షన్స్ కు పాటలు అందించగా.. హిందీలో మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ అందించగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: