సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తిసురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మహేష్ సినిమా వచ్చి చాలా కాలం అయిపోతుండటంతో ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తి దశకు వచ్చేసింది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ కూడా మరోపక్క స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. ఈసినిమా నుండి వరుసగా పాటలు రీలిజ్ చేస్తున్నారు. ఇప్పటికే కళావతి పాటను రిలీజ్ చేయగా సెకండ్ సాంగ్ ను 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో సెకండ్ పాటకు సంబంధించి ప్రోమోను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా సర్కారు వారి పాట సినిమా నుండి ఇంతవరకూ బయటకు రాని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ మాత్రం నేడు పెన్నీ సాంగ్ తో బయటకు వచ్చింది. ఈ పాటలో సితార పాప కూడా మెరిసింది. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరూ సర్ ప్రైజ్ అవ్వడమే కాదు షాకవుతున్నారు కూడా. ఇక సితార కూడా తన ఎంట్రీ గురించి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. సర్కారు వారి పాట టీమ్ తో కలిసి పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు గర్వపడేలా చేస్తానని అనుకుంటున్నా నాన్నా అంటూ పోస్ట్ చేసింది. మరి ప్రోమో కే ఇంత రెస్పాన్స్ వస్తే ఫుల్ సాంగ్ కు ఏ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
కాగా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే12న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: