రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు కాకుండా అందలోనూ ఎన్టీఆర్–రామ్ చరణ్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కోసం కేవలం ఎన్టీఆర్-చరణ్ అభిమానులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు ఫైనల్ గా మార్చి 25 న బ్రేక్ పడనుంది. ఇక దీంతో చిత్రయూనిట్ మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్బంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ మల్టీస్టారర్ పై పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఫ్యూచర్లో మరో మల్టీస్టారర్స్ చేయాల్సి వస్తే.. బాల బాబాయి, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌తో చేస్తాను అని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికే ఎన్టీఆర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇక ఎన్టీఆర్ పైన చెప్పిన కాంబినేషన్స్ లో మల్టీస్టారర్ వస్తే ఆసినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. మరి ఎన్టీఆర్ తన మనసులో మాట చెప్పాడు.. మరి డైరెక్టర్స్ ఎవరైనా కథ రాసే ధైర్యం చేస్తారేమో చూద్దాం..
కాగా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: