దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ అవ్వగా అవి సినిమాపై మంచి అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అవ్వాలి కానీ వాయిదా పడింది. దీంతో కొద్ది రోజులు ప్రమోషన్ కార్యక్రమాలకు బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోసారి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ప్రమోషనల్ ఆంథమ్ అంటూ ఎత్తర జెండా సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాట కూడా కలర్ ఫుల్ గా అందర్నీ ఆకట్టుకంటుంది. ‘పారాయి పాలనపై కాలు దువ్వి, కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమర వీరులను తలుచుకుంటూ’ అంటూ ఈ పాట మొదలైంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ఇద్దరు కలిసి కనిపించే ఈ పాట సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
Celebrate the magic of Indian Cinema with #RRRMovie from March 25th…
The joyful #RRRCelebrationAnthem, #EttharaJenda is here! 🕺🏻💃🏻🕺🏻
▶️ https://t.co/Qk07CshEIW#EttharaJenda #Sholay #Koelae #EtthuvaJenda #EtthukaJenda#RRRMovie
— RRR Movie (@RRRMovie) March 14, 2022
కాగా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: