డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“RRR” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం “ఆర్ ఆర్ ఆర్” మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్, నిర్మాత దానయ్య హాజరు అయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ .. “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ కంటే “ఆర్ ఆర్ ఆర్ “మూవీ పెద్దదనీ , ఇది ఎవరి జీవిత చరిత్ర కాదనీ , ఇదొక ఫిక్షన్ మూవీ అనీ , ఎన్టీఆర్ ఒక సూపర్ కంప్యూటర్ అనీ ,షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తనను చాలాసార్లు ఆశ్చర్యపరిచాడనీ చెప్పారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ గొప్ప మనిషి అనీ , అతను స్నేహితుడిగా లభించడం తన అదృష్టమనీ , నాటు నాటు పాట బిగ్ స్క్రీన్ పై చూడటానికి అద్భుతంగా ఉంటుందనీ , ఈ సాంగ్ తమ ఇద్దరి అభిమానులకు పండగలా ఉంటుందనీ , తాను మల్టీ స్టారర్ మూవీస్ లో నటించడానికి సిద్ధమే ననీ చెప్పారు. రామ్ చరణ్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ నటనా నైపుణ్యం చూసి తాను ఆశ్చర్యపోయాననీ , ఉక్రెయిన్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం లేదనీ చెప్పారు. ఉక్రెయిన్ ప్రజలకు ముఖ్యంగా డ్యాన్సర్లకు కొత్త విషయం తెలుసుకోవాలనే తపన ఎక్కువనీ , వారంతా చాలా ఫ్రెండ్లీ పర్సన్స్అనీ , నాటు నాటు సాంగ్ లో వాళ్ళు బాగా డ్యాన్స్ చేశారనీ ఎన్టీఆర్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: