గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షక , అభిమానుల అంచనాలకు తగినట్టుగా లేకపోయినా అందమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. రెండు రోజులలోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన “రాధేశ్యామ్ “మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళతో ప్రదర్శించబడుతుంది. 3 రోజులకు సుమారు 128 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫుల్ రన్ లో “రాధేశ్యామ్ “మూవీ భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: