కమల్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Kamla Haasans Vikram Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Vikram,Vikram Movie,Vikram Movie Update,Vikram Movie Latest News,Vikram Movie Shoot Updates,Vikram Movie latest Shooting Updates,Vikram Movie Shoot Wrapped Up, Vikram Movie Team Announced Release Date,Vikram Movie Release Date on June 3rd,MJune 3rd Vikram Movie in Theaters,Kamal Haasan Vikram Movie Updates, Kamal Haasan As a Gang Starr in his Upcoming Movie Vikram,Kamal Haasan to Play Gang Starr Role in His Upcoming Movie Vikram,Kamal Haasan and Fahadh Faasil in Vikram Movie, Fahadh Faasil New Movie,Fahadh Faasil Upcoming Movie,Fahadh Faasil Latest Movie Updates,Fahadh Faasil in Vikram Movie,Actro Vijay Sethupathi,Vijay Sethupathi Upcoming Movie, Vijay Sethupathi New Movie,Vijay Sethupathi in Vikram Movie,Vijay Sethupathi Vikram Movie Updates,Vikram Movie On 3rd June,Vijay Sethupathi Vikram Movie on June 3rd, Vijay Sethupathi with Kamal Haasan,Lokesh Kanagaraj Director,Lokesh Kanagaraj Movie Vikram,Lokesh Kanagaraj with Kamal Haasan Mvie Vikram,Lokesh Kanagaraj Upcoming Movie, Lokesh Kanagaraj New Movies in 2022,#Vikram,#KamalHaasan,#vijaysethupathi

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విక్రమ్. ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ముందే చెప్పినట్టు నేడు ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. జూన్ 3వ తేదీన ఈసినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సినిమా మేకింగ్ వీడియోను కమల్ హాసన్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. విక్రమ్ విడుదల కోసం తాను కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానని.. జూన్ 3న థియేటర్లలో కలుసుకుందాం అంటూ పోస్ట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

కాగా ఈసినిమాలో కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.