ఆంధ్ర ప్రదేశ్ సి ఎం జగన్ తో టాలీవుడ్ హీరోలు టికెట్ రేట్స్ , స్పెషల్ షో లకై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చర్చల తరువాత రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి పెంచిన టికెట్ రేట్స్ తో కొత్త జీవో విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్:నాన్ ఏసీ థియేటర్లలో రూ.60, రూ.40ఏసీ థియేటర్లలో రూ.100, రూ.70స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.150, రిక్లయినర్ సీట్లు రూ.250, మున్సిపాలిటీ:నాన్ ఏసీ థియేటర్లలో రూ.50, రూ.30ఏసీ థియేటర్లలో రూ.80, రూ. 60స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.80మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.125, రిక్లయినర్ సీట్లు రూ.250,నగర/గ్రామ పంచాయతీ:నాన్ ఏసీ థియేటర్లలో రూ.40, రూ.20ఏసీ థియేటర్లలో రూ.70, రూ.50స్పెషల్ థియేటర్లలో రూ.90, రూ.70మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.100, రిక్లయినర్ సీట్లు రూ.250(ఈ రేట్లకు జీఎస్టీ, మెయింటెనెన్స్, సర్వీస్ ఛార్జెస్(ఆన్‌లైన్ బుకింగ్) అదనం).
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you Sri. @ysjagan garu @AndhraPradeshCM pic.twitter.com/BsvmsEPrxt
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2022
ఈ జీవోపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ.. సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారికి చిత్ర పరిశ్రమ తరపున కృతజ్ఞతలనీ , చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం అనీ , సంబంధిత మంత్రివర్యులు పేర్ని నానిగారికి, అధికారులకి, కమిటీకి ధన్యవాదాలనీ చిరంజీవి ట్వీట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: