పలు సూపర్ హిట్ మూవీస్ లో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన సత్య “వివాహభోజనంబు ” మూవీ తో లీడ్ యాక్టర్ గా మారారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి , సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో కామెడీ థ్రిల్లర్ “హ్యాపీ బర్త్ డే”మూవీ తెరకెక్కుతుంది. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శుక్రవారం నటుడు సత్య పుట్టినరోజు సందర్భంగా “హ్యాపీ బర్త్ డే”మూవీ నుండి అతని లుక్‌తో చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. నవ్వించేలా ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుతున్నామనీ, ఫిక్షనల్ ప్రపంచంలో సాగే ఈ సినిమా సరికొత్త పాత్రలతో, మాటలతో ఆకట్టుకుంటుందనీ నిర్మాతలు చెబుతున్నారు.ఈ మూవీ కి చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాతలు. నవీన్ యేర్నేని, వై రవిశంకర్ సమర్పిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: