అన్ని సినీ పరిశ్రమల సంగతి ఏమో కానీ.. టాలీవుడ్ మాత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంది.గత రెండేళ్లుగా కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు పడుతుందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. అయినా కూడా మన వాళ్లు ధైర్యంతో సినిమా షూటింగ్ లు పూర్తి చేస్తున్నారు. అంతేకాదు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా కొన్ని మాత్రం బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకుంటూ పక్క ఇండస్ట్రీలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. 2021 డిసెంబర్ లో అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు మంచి విజయం సాధించగా.. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో బంగార్రాజు మంచి హిట్ కొట్టింది. ఇక ఈనెలలో రీసెంట్ గా వచ్చిన భీమ్లానాయక్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇక ఈనెలలో కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వీటితో పాటు మినిమం బడ్జెట్ సినిమాలు ఇంకా చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* ముందుగా మార్చి 4న పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. శర్వానంద్ ఆడవాళ్ళు మీకు జోహార్లు, సెబాస్టియన్ పీసీ524 సినిమాలు మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి. దీనితో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కాజల్,అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హే సినామిక. ఈసినిమా కూడా మార్చి 4నే ఈసినిమా రిలీజ్ కానుంది.
* ఇటీవలే జై భీమ్ సినిమా తో ఆస్కార్ లెవెల్ లో ప్రేక్షకులను అలరించిన సూర్య ఇప్పుడు ఓ మాస్ మసాలా చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాండి రాజ్ దర్శకత్వంలో సూర్య ఈటీ సినిమా చేస్తున్నాడు.మార్చి 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
* ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఎదురుచూస్తున్న సినిమా రాధేశ్యామ్. మరోసారి ప్రభాస్ ఈసినిమాలో లవర్ బాయ్ అవతారం ఎత్తుతున్నారు. వింటేజ్ ప్రేమకథగా రూపొందిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎన్నో సార్లు వాయిదా పడగా ఫైనల్ గా మార్చి 11వ తేదీన రిలీజ్ కాబోతుంది.
* దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ల నిరీక్షణ, ఎన్నో వాయిదాల అనంతరం ఫైనల్ గా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
* చేతన్ కుమార్ దర్శకత్వంలో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమా జేమ్స్. పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ఇది. దీంతో ఈసినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అంటే మార్చి 17వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
* రీసెంట్ గానే ఖిలాడి సినిమాతో అలరించిన రవితేజ్ అప్పుడే మరో సినిమాతో వచ్చేశాడు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: