పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే కళావతి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం.. ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు మరో అప్ డేట్ వచ్చింది ఈసినిమా నుండి. ఈరోజు శివరాత్రి పండుగ సందర్బంగా ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు పండుగ విషెస్ అందించారు. పోస్టర్ లో మహేష్ విలన్లతో ఫైట్ చేస్తున్నట్టు ఉండగా.. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
Wishing you all a happy #MahaShivaratri! May the ever benevolent Lord Shiva bring strength and abundance! Let good conquer all evil! 🙏 pic.twitter.com/PnNeo5HbHE
— Mahesh Babu (@urstrulyMahesh) March 1, 2022
కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: