రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న థమన్ ఎస్ “రాధేశ్యామ్ “మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఆ సందర్భంగా థమన్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. “రాధేశ్యామ్ “మూవీకి మనసు పెట్టి పని చేస్తున్నాననీ , దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తనను మరోసారి ప్రేమలో పడేలా చేశాడనీ , ఈ సినిమా తన హృదయాన్ని చాలా బలంగా తాకిందనీ , దర్శకుడు రాధాకృష్ణ తనను కొత్తగా ఆవిష్కరించుకునేలా చేశాడనీ థమన్ ట్వీట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: