ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ మార్చి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బు , రాధికా , ఊర్వశి , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ఫిబ్రవరి 27న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిపింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా దర్శకుడు సుకుమార్ , స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయి పల్లవి పాల్గొన్నారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ … తన అభిమాన దర్శకుడు సుకుమార్ , హీరోయిన్ కీర్తి సురేష్ , తన మంచి ఫ్రెండ్ సాయి పల్లవి ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉందనీ , . ఈ చిత్రానికి ప్రాణం పోసిన దేవి శ్రీ ప్రసాద్ రియల్ రాక్ స్టార్ అనీ , బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చినందుకు థాంక్స్ అనీ , సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, రాధిక, ఊర్వశి తదితరులు తో నటించడం ఆనందంగా ఉందనీ , నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి థాంక్స్ అనీ , “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తన కెరీర్ లో బెస్ట్ సినిమా గా నిలుస్తుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: