ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్ గా మార్చి 11వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ ఐడియా నాది కాదు ప్రభాస్ ది అంటున్నారు రాధాకృష్ణ. తాజాగా ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధాకృష్ణ ఈసినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాని ముందు నుంచి ఇటలీ బ్యాక్ డ్రాప్ లోనే అనుకున్నారా? అన్న ప్రశ్నకు రాధాకృష్ణ సమాధానం చెబుతూ.. రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామనుకున్నా కానీ ప్రభాస్ గారు ఇచ్చిన సూచనలతో ఇటలీ బ్యాక్ డ్రాప్ కి మార్చాను, అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువల్ ఎస్సెట్ గా మారింది అని చెప్పారు. మరి నిజంగానే ప్రభాస్ ఇచ్చిన ఐడియా సినిమా ప్రధానం బలం కానుందని ఇప్పటికే టీజర్, ట్రైలర్ లలో వచ్చిన విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. చూద్దాం మరి ఈసినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో..
కాగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: