డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ మూవీ ప్రమోషన్స్ ను మార్చి 1 వ తేదీ నుండి భారీ ఎత్తున చేపట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. “రౌద్రం రణం రుధిరం ” మూవీ లోని “నాటు నాటు “సాంగ్ కు హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు అద్భుతంగా డ్యాన్స్ మ్యాచ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొంది 200 మిలియన్ క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. “RRR” మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: