పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇక సినీ లవర్స్ సంగతి పక్కన పెడితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడిని వెండి తెరపై చూద్దామా అన్న ఆత్రుతలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతినివ్వడంతో ఇక్కడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈసినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈసినిమా రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈసినిమా గురించి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈసినిమా మాతృకలో నటించిన బిజూ మీనన్, పృథ్వీ రాజ్ కు ఈసినిమా ట్రైలర్ చాలా బాగా నచ్చిందని తెలిపారు. అంతేకాదు ఈసినిమాలో కొన్ని పోర్షన్స్ ను కూడా వాళ్లు చూశారని.. చాలా ఇంప్రెస్ అయ్యారని తెలిపారు.
కాగా ఈసినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించినా.. మాటలు, స్క్రీన్‌ప్లే మాత్రం త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇక ఈసినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: