మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా “గని “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Ghani will meet you on big screens at a later date!🥊
A new release date will be announced very soon! ✨@IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic @dhilipaction pic.twitter.com/oQoWGNALae
— Renaissance Pictures (@RenaissanceMovi) February 22, 2022
కరోనా కారణంగా పలు మూవీస్ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీస్ సమ్మర్ సీజన్ కు క్యూ కట్టగా చిన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గని మూవీ ని ఫిబ్రవరి 25 రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ “భీమ్లా నాయక్” రిలీజ్ కావడంతో తిరిగి”గని” మూవీ వాయిదాపడింది. “భీమ్లా నాయక్” సినిమా వస్తుండడంతో మేము “గని” ని పోస్ట్ పోన్ చేశామనీ , కొత్త డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తామనీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే అందరితో పాటు తాము కూడా పవన్ సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నామనీ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: