నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు.కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.కీర్తి ప్రస్తుతం చిరంజీవి “భోళా శంకర్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నాని కీర్తి జంటగా తెరకెక్కుతున్న “దసరా “మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ది రూట్, సోనీ మ్యూజిక్ సౌత్ నిర్మాణ సారథ్యం లో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో కీర్తిసురేష్ “గాంధారి” మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లో నటించారు. “లవ్‌స్టోరి “మూవీ ఫేమ్ పవన్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ రోజు “గాంధారి” మ్యూజిక్ వీడియో ను రిలీజ్ చేయనున్నట్టు ప్రోమోను కీర్తి ట్విట్టర్‌లో విడుదల చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: