సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “భీమ్లా నాయక్”మూవీ ని చిత్ర యూనిట్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు . తాజాగా “భీమ్లా నాయక్ ” ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో రూపొందిన ట్రైలర్ కు అద్భుత స్పందన లభిస్తుంది. రిలీజ్ అయిన కొన్ని గంటలలోనే ట్రైలర్ భారీ వ్యూస్ , లైక్స్ సాధించి దూసుకుపోతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: