“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగ చైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ & ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థాంక్యూ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “లాల్ సింగ్ చద్దా “మూవీ తో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా నాగచైతన్య , తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజా హెగ్డే ని కథానాయికగా ఎంపిక చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. “ముగమూడి ” తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే దాదాపు 9 సంవత్సరాల తరువాత “బీస్ట్ “తమిళ మూవీ లో విజయ్ కు జోడీగా నటించారు . నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం ” మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దాదాపు 8 సంవత్సరాల తరువాత పూజా హెగ్డే , నాగ చైతన్య తో జంటగా నటించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: