బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన తొలి సినిమా “ఉప్పెన” విడుదల అయ్యి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కృతి శెట్టి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. జీవితంలో రెండు పుట్టిన రోజులుంటే అందులో ఒకటి మన పుట్టినరోజు, ఇంకొకటి మనం జీవితంలో ఏం చేయాలో సెలెక్ట్ చేసుకున్న రోజుగా భావిస్తాననీ , సంవత్సరం క్రితం నటిగా ఎంట్రీ ఇచ్చి ఇష్టపడి ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నాను కాబట్టి ఈ రోజును మరో పుట్టినరోజుగా భావిస్తున్నాననీ , మీ అందరి ఆదరాభిమానాలు దక్కడం తనకు మరింత సంతోషాన్నిస్తోందనీ ,ఈ సక్సెస్ ఫుల్ జర్నీని గుర్తుంచుకునేలా చేసిన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలనీ , ఇంకా చాలా కష్టపడి మంచి మంచి పాత్రల్లో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తున్నాననీ అంటూ కృతి శెట్టి ఒక ఎమోషనల్ పోస్ట్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: