పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈసినిమా భీమ్లానాయక్ సినిమా కంటే ముందే మొదలు పెట్టినా కూడా కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం త్వరలోనే పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. దీనికోసం డేట్స్ కూడా పవన్ ఫిక్స్ చేసుకున్నాడట మార్చి 18 నుండి పవన్ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. తాజా షెడ్యూల్ బీహార్ లో ప్రారంభం కానున్నట్టు సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షెడ్యూల్ ప్రారంభం కాబోతోందట. వీలైనంత త్వరలో ఈసినిమా షూటింగ్ ను పవన్ పూర్తి చేయాలని చూస్తున్నట్టు సమాచారం..
కాగా మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. వీరమల్లు అనే పేరుమోసిన గజదొంగగా పవర్ స్టార్ కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: