టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ప్రభాస్ తన కెరేర్ లో ఫస్ట్ టైమ్ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పౌరాణిక చిత్రం “ఆది పురుష్” లో నటించారు. ఈ జనరేషన్ లో ఇంతటి భారీ అవకాశం ప్రభాస్ కు రావడం నిజంగా విశేషమే. కొన్ని రోజుల క్రితం షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం వీఎఫ్ ఎక్స్ వర్క్ ను జరుపుకుంటోంది. హాలీవుడ్ మూవీ “అవతార్” కోసం ఉపయోగించిన టెక్నాలజీతో “ఆదిపురుష్ ” మూవీ , రూపొందుతుందనీ , దేశ విదేశాలకి చెందిన 50 మంది సాంకేతిక నిపుణుల టీమ్ ఈ మూవీ కి పనిచేస్తున్నట్టు , రామాయణం నేపథ్యంలో ఇంతవరకూ తెరకెక్కిన మూవీస్ కి మించి “ఆదిపురుష్” మూవీ ఉండనుందనీ సమాచారం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: