యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సక్సె ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కథానాయికగా ఎంపిక అయ్యారు.త్వరలోనే “#NTR30” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
I said @tarak9999 is a global star, a man with great soul, a loving co-star and most importantly an all rounder super star… I was been criticised, people talked wrong about us.. what not.. but I kept standing firm with his potential and see today..I can never be wrong…!!
— Payal Ghoshॐ (@iampayalghosh) February 11, 2022
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే , ఎన్టీఆర్ యాక్టింగ్ స్టైల్ కి ఫిదా అయ్యాననీ, ఎన్టీఆర్ తో నటించాలని ఉందని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీపిక కామెంట్స్ కు “ఊసరవెల్లి” మూవీ ఫేమ్ బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్, మంచి మనిషి, అంతకు మించి ఆల్ రౌండర్ స్టార్.ఇవన్నీ తాను ఎప్పుడో చెప్పాననీ , కానీ తనను అందరూ విమర్శించారనీ , నెగెటివ్‌గా మాట్లాడారనీ , కానీ మొదటి నుంచి ఆయన సత్తా గురించి అదే చెబుతూ వచ్చాననీ , ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వస్తోందనీ , తాను చెప్పింది ఎప్పుడూ తప్పు కాలేదంటూ పాయల్ ఘోష్ ట్వీట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: