విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దూ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా డీజే టిల్లు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. యూత్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈసినిమాలో ఉండటంతో ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు. ఇక ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వారి నమ్మకాన్ని ఈసినిమా ఎంత వరకూ నిజం చేసింది.. సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి తదితరులు
దర్శకత్వం.. విమల్ కృష్ణ
బ్యానర్.. సితార ఎంటర్టైన్ మెంట్స్
నిర్మాత..సూర్యదేవర నాగవంశీ
సమర్పణ..పి.డి.వి.ప్రసాద్ సమర్పణ
సంగీతం.. చరణ్ పాకాల
నేపథ్య సంగీతం.. థమన్
సినిమాటోగ్రాఫి.. సాయిప్రకాష్
కథ
బాల గంగాధర్ తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. హైద్రాబాద్ లో డీజేగా పని చేస్తుంటాడు. ఒక పార్టీలో టిల్లుకి రాధిక (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా ఇద్దరూ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. దాని నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాల్లో సిద్ధు, రాధిక పలు పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. చివరికి ఆ మర్డర్ కేసు నుండి టిల్లు, రాధిక ఎలా బయట పడ్డారు అన్నది ఈసినిమా కథ.
విశ్లేషణ
కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఫిదా అవుతుంటారు. సినిమాలో కాస్త కామెడీ అనేది ఉంటేనే మన ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాంటి సినిమాలకు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. ఇక కామెడీ థ్రిల్లర్ సినిమాలకు కూడా మన దగ్గర మంచి ఆదరణ ఉంటుంది. అంతేకాదు హీరో మర్డర్ కేసులో ఇరుక్కోవడం.. దాని నుండి బయట పడటానికి ప్రయత్నాలు చేయడం.. ఈ నేపథ్యంలో ఇప్పటికి ఎన్నో కథలు వచ్చాయి. అయితే ఓ కథను తీసుకున్నా ఆ కథకు ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అయ్యాడు.. ఎంత ఇంట్రెస్ట్ గా చూపించగలిగాడు అన్న దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇక డీజే టిల్లు కూడా అదే కోవలోకి వస్తుంది.. అయితే ఈసినిమాకుకామెడీ యాంగిల్ ను జోడించి ప్రేక్షకుడిని నవ్విస్తూ.. ఎక్కడా బోర్ కొట్టించకుండా తీశారు. అందుకే ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు.
ఈసినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం చేసినా కథ మాత్రం సిద్దూదే. తను రాసుకున్న పాత్రే కాబట్టి.. ఆపాత్ర ఎలా ఉంటుందో వర్కవుట్ అవుతుందో తనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. అదే ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఈసినిమాకు ప్రధాన ఆకర్షణ డీజే టిల్లు పాత్ర. ఈ పాత్రలో సిద్దూ కామెడీ టైమింగ్, పెర్ఫామెన్స్, ముఖ్యంగా తెలంగాణ యాసలో సిద్దూ డైలాగ్స్ మెయిన్ హైలెట్. ఒక రకంగా చెప్పాలంటే సిద్దూ వన్ మ్యాషో అని చెప్పొచ్చు. సీరియస్ సన్నివేశాల్లో కూడా కామెడీతో మెప్పించారు. ఈసినిమా తరువాత సిద్దూ ఖచ్చితంగా బిజీ హీరో అయిపోతాడని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ గా చేసిన నేహాశెట్టి కూడా ఈసినిమాలో మరో హైలెట్. తన పరిధి మేరకు పాత్రకు న్యాయం చేసింది సిద్దూ తో తన కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ మధ్య నడిచే కామెడీ సంభాషణలు హిలేరియస్ గా ఉంటాయి. కథలో కీలకమైన పాత్రల్లో బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ప్రిన్స్ వారి పాత్రల మేర నటించారు. మిగతా పాత్రలు పర్వాలేదనిపించాయి.
ఇక విమల్ కృష్ణ సిద్దూ కథను అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమా అయినా కూడా డైరెక్షన్ లో ఎలాంటి లోపం లేకుండా ప్రజెంట్ చేయగలిగాడు. శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు బాగున్నాయి. ఇప్పటికే టైటిల్ సాంగ్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందే చూశాం. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థమన్ అందించగా.. తన అనుభవం కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కథలోని ఫీల్‌ను ఎలివేట్ చేస్తూ సాగింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాబట్టి క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. చిన్న సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు మేకర్స్.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన డీజే టిల్లు ఫుల్ ఫన్ రైడింగ్ అని చెప్పొచ్చు. యూత్ ను టార్గెట్ చేసి మేకర్స్ ఈసినిమా తీయగా.. ఆ టార్గెట్ ను రీచ్ అయ్యారని చెప్పొచ్చు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























