విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈ కాతు వాకుల రెండు కాదల్ సినిమా వస్తుంది.
ఇక ఈసినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి, నయనతార, సమంత లు ముగ్గురు స్టార్ హీరో హీరోయిన్స్.. ఇక వాళ్లు ఎంచుకునే పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అంతేకాదు కాదు ఈసినిమా కోసం అటు తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకుంటూనే మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రోమాంటిక్ కామెడీగా వస్తున్న ఈ సినిమా టీజర్ లో కూడా ఫుల్ కామెడీ ఉంది. విజయ్ సేతుపతి చేసే కామెడీ అలరిస్తుంది. కాగ ఈ టీజర్ తో ఈ సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 28న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Here it is 🤩🤩#KRKTeaser – https://t.co/whdJf6lqSM
IN THEATRES FROM APRIL 28🔥#KaathuVaakulaRenduKaadhal ♥️♥️#Anirudh25
A @VigneshShivN Directorial🎬
An @anirudhofficial Musical🪗@VijaySethuOffl #Nayanthara @Samanthaprabhu2 @Rowdy_Pictures @SonyMusicSouth @proyuvraaj pic.twitter.com/rieBArfadN— Seven Screen Studio (@7screenstudio) February 11, 2022
కాగా ఈసినిమాలో క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలిసి విఘ్నేష్ శివన్ తన సొంత బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: