పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఖిలాడి” మూవీ రిలీజ్ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మీడియా తో సమావేశమయ్యి పలు విశేషాలు తెలియజేశారు. నిర్మాత కోనేరు మాట్లాడుతూ .. ఏ సినిమా అయినా కథ బాగుంటేనే ఆడుతుందనీ , మేం కథని నమ్మి “రాక్షసుడు” మూవీ తీశామనీ , ఆ మూవీ సూపర్ హిట్ అయ్యిందనీ , ఇప్పుడు ‘ఖిలాడి’ బలం కూడా కథేననీ , కచ్చితంగా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందనీ , “ఖిలాడి “మంచి కమర్షియల్ చిత్రమనీ , మాస్, సస్పెన్స్ , ఫ్యామిలీ అంశాలు అన్నీ ఉన్నాయనీ , ఈ సినిమాని హిందీలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామనీ , ఇలాంటి పాయింట్‌తో ఇదివరకు ఏ సినిమా రాలేదనీ , ఇటలీలో తెరకెక్కించిన సన్నివేశాలు చూస్తే హాలీవుడ్ సినిమాలా అనిపిస్తుందనీ , సినిమాని చాలా స్టైలీష్‌గా దర్శకుడు తెరకెక్కించారనీ, కొత్తవాళ్లని ప్రోత్సహించాలని, వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఉందనీ ,ఆ ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: