గత ఏడాది క్రాక్ తో మంచి సూపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ఆ సినిమా తరువాతవరుసగా సినిమాలను చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ కు తక్కువ రోజులు ఉండటంతో వీలైనంత ఎక్కువగా ఈసినిమా ప్రమేషన్స్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. దానిలో భాగంగానే వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.. ఇంకా వరుసగా పాటలను కూడా విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఐదు పాటలను రిలీజ్ చేశారు. అందులో రీసెంట్ గా క్యాచ్‌మీ అంటూ సాగే పాటను విడుదల చేయగా ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోయేలా ఉన్నాయి. రవితేజ మరొకసారి తన మాస్ విశ్వరూపం చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటుగా ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న వారు కూడా ట్రైలర్ లో తమ రోల్ పై క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: