యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ పడలేదు శర్వానంద్ కు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. రీసెంట్ గా మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇక ఈసినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Excited 😊#AadavalluMeekuJohaarlu Teaser on 10th FEB ❤️#AMJOnFEB25@iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl @LahariMusic @TSeries pic.twitter.com/cgyt2TOFKz
— Sharwanand (@ImSharwanand) February 7, 2022
ఇంకా ఈసినిమాలో వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్ రాజు తదితరులు నటిస్తున్నారు.జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: