ఈరోజుల్లో ఒక సినిమా ప్రమోషన్ ఎంత డిఫరెంట్ గా ఉంటే అంత క్రేజ్ ను సొంతం చేసుకుంటుంది. అందుకే ఏదో ఒక విభిన్నత ఉండేలా చూసుకుంటారు. ఇక ఇప్పుడు నానిచేసిన ట్వీట్ కూడా సినిమా ప్రమోషన్ కు అలానే ఉపయోగపడింది అంటున్నారు. అసలు సంగతేంటంటే.. ఇటీవల వాయిదా పడ్డ సినిమాలన్నీ కొత్తగా రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రం ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి రెండు రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో నాని కూడా తన కొత్త సినిమా అంటే సుందరానికి సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశాడు. అయితే నాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేశాడు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల్లో కలిపి ఏడు డేట్లను ఫిక్స్ చేస్తూ.. అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా అంటూ చమత్కరించాడు కూడా. ఇక ఇప్పుడు నాని చేసిన ట్వీట్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక నాని ట్వీట్ కు రానా కూడా స్పందించి ఎపిక్ సుందరం అంటూ రీట్వీట్ కూడా చేశాడు. దీనితో అంటే సుందరానికి మరింత రీచ్ దక్కినట్టు అయ్యింది. మరి ముందు మందు ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ ఉంటాయో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Epic 🔥😅😎😎😎 Sundar !! https://t.co/DFdYhOlMf7
— Rana Daggubati (@RanaDaggubati) February 3, 2022
కాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో వస్తున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: