పుష్ప కలెక్షన్స్ 50 డేస్.. 365 కోట్లు

Pushpa Movie 50 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pushpa,Pushpa Movie,Pushpa The Rise Movie,Pushpa Movie 50days Collections,Pushpa The Rise Movie Collections,Pushpa Movie 50 days Collections,Blockbuster Movie Pushpa The Rise, Pushpa Blockbuster Movie,Pushpa Super Hit Movie,Pushpa Collected 350crs In 50days,Pushpa Box Office Collections,Pushpa Latst Movie Collections Updates,Pushpa Movie Updates, Director Sukumar Movie,Sukumar Pushpa Movie Updates,Pushpa Skumar's Movie,Rashmika in Pushpa Movie part 1,Pushpa the Rise Part1 Movie,Rashmika movie,All Arjun Movies,All Arjun New Movie, Rashmika Upcoming movies,#pushpatherise

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న సామెత గుర్తుండే ఉంటుంది కదా. అలాానే ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ ఎంట్రీ చూస్తుంటే. మొదటి పాన్ ఇండియాతోనే దేశవ్యాప్తంగా టాక్ ఆప్ ద టౌన్ అయ్యాడు. పుష్ప సినిమా కంటే ముందు మొదలైన ఎన్నో పెద్ద సినిమాలు ఇంకా రిలీజే కాలేదు. కానీ కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా షూటింగ్ ను మాత్రం పూర్తి చేసి గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ సినిమా ప్రమోషన్స్ కు కూడా ఎక్కువ రోజులు కూడా టైమ్ లేదు. మన తెలుగులో కాస్త ప్రమోషన్స్ చేసినా మిగిలిన భాషల్లో అయితే టైమ్ లేకపోవడంతో నామమాత్రంగా మాత్రమే చేశారు. నార్త్ లో అయితే ఏదో అలా ఒకరోజు వెళ్లి ప్రమోషన్ చేశారు అంతే. అయినా కూడా ఈసినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూస్తున్నాం. తెలుగులో స్టార్ హీరో కాబట్టి ఎలాగైనా చూసేస్తారు.. కానీ ఇతర భాషల్లో కూడా బన్నీ తన హవా చూపిస్తున్నాడు. నార్త్ ఆడియన్స్ అయితే బన్నీ సినిమాకు.. నటనకు ఫిదా అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి నార్త్ ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పుష్ప సినిమాపై, బన్నీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈసినిమాలో బన్నీ డీగ్లామర్ గా, రస్టిక్ అండ్ మాస్ లుక్ లో కనిపించినా కూడా నార్త్ ఆడియన్స్ కు నచ్చేసింది. అందుకే అక్కడ అంత ఘన విజయం సాధించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా పది రోజులు ఆడటమే కష్టంగా ఉంటే.. ఈసినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతునే ఉంది. ఇక ఈ సినిమా తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.

కాగా సుకుమార్ ఈసినిమాను ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ పోషించిన రోల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక ఇప్పుడు జోష్‌లో పుష్ప రెండో భాగం షూటింగ్ కోసం సిద్ధమవుతోంది అల్లు అర్జున్ అండ్ టీమ్.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =