ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది ఏకంగా ఏడు సినిమాలతో బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఆయుష్మాన్ ఖురానా సరసన డాక్టర్ జీ, అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న రన్ వే-34, అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రాల సరసన థ్యాంక్ గాడ్, ఛత్రీవాలీ, అటాక్ లతో పాటు ఒక టైటిల్ పెట్టని చిత్రంలోను ఆమె నటిస్తుంది. ఇక వీటిలో కొన్ని సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవ్వనున్నాయి. అందులో అటాక్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మూవీని ఏప్రిల్ 1న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్టు నిన్న ప్రకటించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు మేకర్స్. ఇప్పుడు మొదటి పార్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నెక్స్ట్ ఇయర్ రెండో పార్ట్‌ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Get ready to witness our country’s first super soldier and his strike to save the nation’s pride 🇮🇳#Attack – Part 1 releasing in cinemas worldwide on 1st April, 2022.
@LakshyaRajAnand @TheJohnAbraham @Asli_Jacqueline #RatnaPathakShah @prakashraaj @jayantilalgada pic.twitter.com/RzWGwQC8h4— Rakul Singh (@Rakulpreet) February 3, 2022
కాగా లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో జాన్ అబ్రహామ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడ నిర్మిస్తున్నారు. రకుల్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: