యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న“#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం” మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా నటించిన అలియా “#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్న అలియా కు టాలీవుడ్ లో “#NTR30” మూవీ రెండవ చిత్రం. ఈ సందర్భంగా అలియా మాట్లాడుతూ .. దర్శకుడు కొరటాల “#NTR30” మూవీ స్టోరీ , తన పాత్ర గురించి చెప్పారనీ , తాను ఇంప్రెస్ అయ్యి ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యాననీ , “RRR” మూవీ తరువాత ఎన్టీఆర్ తో నటించడం థ్రిల్లింగ్ గా ఉందనీ చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: