భారీ సెట్స్ లో "ది వారియర్ "యాక్షన్ సీన్స్
Huge Sets for Ram Pothineni Movie The Warrior

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతిశెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
హీరో రామ్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్ ” మూవీ కై రామోజీ ఫిల్మ్ సిటీ లో ఐదు భారీ సెట్స్ రూపొందాయి. ఫైట్ మాస్టర్ అన్బు- అరివు పర్యవేక్షణలో హీరో రామ్ , ఆది పినిశెట్టి లపై భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కుతున్నాయి. కర్నూలు నేపథ్యంలో సాగే యాక్షన్ సీన్స్ "ది వారియర్ " మూవీ కి హైలైట్ కానున్నాయి. హీరో రామ్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ది వారియర్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
వీడియోస్
00:01:21RED Official Teaser
00:13:14Ram Pothineni B2B Punch Dialogues
00:06:06Shivam Movie Special
00:03:19


