నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కీర్తి సురేష్
ఈ సినిమాపై ఆసక్తి కలిగించే కారణాల్లో కీర్తి సురేష్ కూడా ఒకటి. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కీర్తి సురేష్ ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించినా.. మహానటి సావిత్రి బయోపిక్ మాత్రం తన కెరీర్ ను మార్చేసింది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అంతేకాదు ఆ సినిమాతో జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. ఇక ఆ తరువాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఎక్కువగా చేసింది కీర్తి సురేష్. ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కాబోతుంది.
కథ
ఈ సినిమా కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో క్రీడా నేపథ్యంలో వచ్చే సినిమాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. అయితే ఈమధ్య కాస్త ఈ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే కబడ్డీ నేపథ్యంలో సీటీమార్, ఆర్చరీ నేపథ్యంలో లక్ష్య ఇంకా బాక్సింగ్ నేపథ్యంలో కూడా సినిమాలు వస్తున్నాయి. ఇక ఈసినిమా షూటర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ లో పెద్దగా వచ్చిన సినిమాలు ఏం లేవు. బ్యాడ్ లక్ సఖి నుండి హీరోయిన్ గుడ్ లక్ సఖి ఎలా మారిందనేది ఈ సినిమా కథ. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
క్యాస్టింగ్
ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు టాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆది నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. హీరోయిన్ ను ప్రొఫెషనల్ షూటర్ గా తయారుచేసే కోచ్ గా ఈ సినిమాలో నటిస్తున్నాడు జగ్గూభాయ్. వీరితో పాటు రాహుల్ రామకృష్ణ కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాహుల్ రామకృష్ణ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో పలు పాత్ర పధానమైన రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.
శ్రావ్య వర్మ
ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ నిర్మాణ రంగంలోకి అడుపెడుతున్న సంగతి తెలిసిందే. కేవలం మగవాళ్లు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా తాము ఏమాత్రం తక్కువకాదు అన్నట్టు నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. ఈనేపథ్యంలోనే శ్రావ్యవర్మ కూడా ఈసినిమాకు ఒక నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతోమందికి స్టైలిస్ట్ గా పనిచేశారు శ్రావ్యవర్మ. ఇప్పుడు నిర్మాతగా కూడా మారుతున్నారు. మరి ఈసినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.
థియేట్రికల్ రిలీజ్
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయాలంటే కాస్త కష్టమే. ఇప్పటికే గుడ్ లక్ సఖి కూడా చాలా సార్లు రిలీజ్ ను వాయిదా వేసుకుంది. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ అవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఫైనల్ గా జనవరి 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మంచి సినిమాలు వస్తే మన ఆడియన్స్ ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆదరిస్తారనేది ఇప్పటికే రుజువు చేశారు. అందుకే మేకర్స్ ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోయినా కూడా థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: