మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ 15వ సినిమాగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే మధ్యలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం చరణ్ ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాస్త వాయిదా పడటంతో ప్రస్తుతం చరణ్ మళ్లీ శంకర్ సినిమాపై చరణ్ ఫోకస్ చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మిస్తున్న సంగతి కూడా విదితమే. తన కెరీర్ లో వస్తున్న 50 సినిమా కాబట్టి దిల్ రాజు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న దిల్ రాజు ఈసినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఈసినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు. మరి అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో.. కరోనా వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో.. చెప్పినట్టే అప్పుడే ఈసినిమాను రిలీజ్ చేస్తారో?లేదో? చూద్దాం..
ఇక ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: