అమెజాన్ లో ‘కొండపొలం’.. నెటిజన్స్ నుండి సూపర్ రెస్పాన్స్

Kondapolam on Prime Video is getting great response from audience,Telugu Filmnagar,Tollywood Movie Updates, Telugu Film News 2021, Tollywood Movie Updates, Latest Telugu Movie News, Latest Telugu Movie Updates,Tollywood Lates News,Kondapolam,Kondapolam Movie,Kondapolam Movie Updates,Kondapolam Movie latest updates,Kondapolam Movie Prime Video,Kondapolam Movie on Prime Video,Kondapolam Movie Response,Kondapolam Movie Audience Response from Prime Video,Kondapolam Movie Amazon Prime Video,Kondapolam Movie Amazon Prime Video Latest Updates,Kondapolam Movie 2021 updates,2021 Kondapolam Movie latest updates

ప్రస్తుతం ఆడియన్స్ సినిమాలను చూసే విధానం మారిపోయింది. ఒకప్పుడు కమర్షియల్ ఎలిమెంట్సే ఎక్కువగా ఉండే సినిమాలు ఎక్కువ హిట్ అయ్యేవి. హీరో ఫైట్స్ చేసి.. హీరోయిజం చూపించి, ఆరు పాటలు ఉండే సినిమా హిట్ అనుకునే రోజులు పోయాయి. కానీ ఇప్పుడు అలా కాదు.. కొత్తగా డైరెక్టర్స్ ఏది ట్రై చేసినా ఆడియన్స్ వాటిని కూడా ఆదరించడానికి రెడీగా ఉన్నారు. అందుకే హీరో ఎలాంటి హడావుడి లేకుండా సినిమాలు తీసినా హిట్స్ అందుతున్నాయి. చిన్న సినిమాలు అయినా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఫైనల్ గా సినిమాలో ఎంత కంటెంట్ ఉంది.. ఎంత కొత్తగా ఉంది అని మాత్రమే చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు కొండపొలం విషయంలో కూడా అదే జరుగుతుంది. నిజానికి ఈసినిమాను క్రిష్ ఒక నవల ఆధారంగా తీసాడన్న సంగతి తెలిసిందే కదా. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. ఇంజనీరింగ్‌ చదివిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం తెచ్చుకోలేక ఇంటికి తిరిగి రావడం, భయపడుతూనే కొండపొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటనలతో మానసికంగా ఎలా బలంగా మారాడు? యూపీఎస్సీ పరీక్షల్లో ఐఎఫ్‌ఎస్‌కు ఎలా ఎంపికయ్యాడన్నదే ఈ సినిమా కథ. ఇక క్రిష్ తన కథలను ఎంత న్యాచురల్ గా చూపిస్తాడో తెలిసిందే కదా. అలాగే ఈసినిమాను కూడా అంతే సహజంగా చూపించాడు. ఇక ఈసినిమాలో నటించిన వైష్ణవ్ తేజ్ కూడా తన నటనతో మెప్పించాడు. ఓబులమ్మ గా రకుల్ డీ గ్లామర్ పాత్రలో నటించి తన పాత్రకు న్యాయం చేసింది. ఇటీవలే ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి ఆదరణను దక్కించుకుంది.

ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇక థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేక పోయిన వారు ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో చూస్తున్నారు. అయితే ఓటీటీ నుండి కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసినిమాను చూసిన ఆడియన్స్ తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సినిమాను తీసినందకుగాను క్రిష్ ను అలాగే వైష్ణవ్ తేజ్ ను ఇంకా చిత్రయూనిట్ ను ప్రశంసిస్తున్నారు. ఇక మీరు కూడా ఈసినిమాను థియేటర్ లో చూడకపోతే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =