దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్ రిలీజ్ చేసి మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. కొమరం భీముడో అంటూ సాగే నాలుగో పాట రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మొత్తం ఐదు భాషల్లో ప్రోమోను వదిలారు. ‘కొమరం భీముడో.. కొమరం భీముడో .. కొర్రాసులెవడోలే మండాలి కొడకా’ అంటూ సాగే ఈ పాట ఎమోషనల్ గా అనిపిస్తుంది. కొమరంభీమ్ స్వభావాన్ని ఈ పాటలో చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈపాటను కాలభైరవ పాడాడు. ఈ పాటను ఐదు భాషల్లోనూ అతడే ఆలపించడం విశేషం. ఫుల్ సాంగ్ వీడియో ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Emotionally spellbinding Song, #RevoltOfBHEEM – Music Video releasing tomorrow at 4PM.
🎶@MMKeeravaani
🎤 @kaalabhairava7
📝#SuddalaAshokTeja@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan #RRRMovie @LahariMusic @TSeries https://t.co/5WmigLDRXz— RRR Movie (@RRRMovie) December 23, 2021
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనుంది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, బాలకృష్ణ గెస్ట్‌లుగా రానున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
కాగా భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరిగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.